calender_icon.png 8 January, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీఆర్‌ఎస్‌ఏ నూతన కమిటీ ఏకగ్రీవం

07-01-2025 01:35:55 AM

* అధ్యక్ష, కార్యదర్శులుగా రాంబాబు, కృష్ణ చైతన్య 

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి ): సీసీఎల్‌ఏ యూనిట్ టీజీఆర్‌ఎస్‌ఏ నూత న కమిటీని సోమవారం హైదరాబాద్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  అధ్యక్షుడిగా రాంబాబు, అసోసియేట్ అధ్యక్షులుగా కే శ్రీనివాసులు, కే రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర్లు, గులాం ఫరూఖ్ అలీ, వెంకటేశం, స్వాతి, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎస్ కృష్ణచైతన్య, కోశాధికారిగా పల్లవి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్వీ సుమిత్ర, డీ సందీప్, స్పోర్ట్స్ సెక్రటరీగా యశ్వంత్, కల్చరల్ సెక్రటరీగా విద్యాదీప్తి, జాయింట్ సెక్రటరీలుగా ఆర్ సురేష్, కే వినయ్‌కుమార్, వినీత, నబీ, ఎస్ రమేశ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బీ ఉమామహేశ్వర్, సీహెచ్ ఉషారాణి, ఎండీ ఇక్రముద్దీన్, డీ సాయినాథ్, అక్బర్ తాబ్‌రెజ్, దివ్య, ఎండీ అహ్మద్ షరీఫ్ ఎన్నికయ్యారు.