calender_icon.png 8 October, 2024 | 6:02 AM

టీజీఎప్‌సెట్ బైపీసీ కౌన్సెలింగ్

08-10-2024 01:55:20 AM

ఈనెల 19 నుంచి ఫస్ట్ ఫేజ్ షురూ

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): టీజీఎప్‌సెట్ బైపీసీ అభ్యర్థుల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు సోమవారం విడుదల చేశారు. బీఫార్మసీ, ఫార్మ్‌డీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఈమేరకు విడుదల చేశారు. ఈనెల 19 నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది.

19 నుంచి 22వ తేదీలోపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు 21 నుంచి 23వ తేదీలోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. 21 నుంచి 25 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు, 28వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.

సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. నవంబర్ 4వ తేదీన ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 5వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు.

5, 6 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నమోదు, 9న సీట్ల కేటాయింపు చేపడతారు. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ తేదీలోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 11, 12 తేదీల్లో నేరుగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. నవంబర్ 12న స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.