calender_icon.png 12 December, 2024 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న యూపీఎస్సీ చైర్మన్‌తో టీజీపీఎస్సీ భేటీ

12-12-2024 01:35:48 AM

  • 19న ఎస్సెస్సీ చైర్మన్‌తో సమావేశం
  • పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంపై చర్చ

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): టీజీపీఎస్సీ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపట్టడంపై సర్కారు దృష్టి సారించింది. ఈక్రమంలోనే ఇటీవల టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పకడ్బందీగా పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 18న యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుదాన్‌తో భేటీ కానున్నారు.

19న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ సహా సభ్యులతోనూ సమావేశం కానున్నారు. ఈ భేటీలో పరీక్షల విధానం, నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియ, ఎంపిక విధానాల గురించి రెండు కమిషన్ల చైర్మన్లతో చర్చించనున్నారు. ఈ విషయమై యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్లతో బుర్రా వెంకటేశం ఫోన్‌లో మాట్లాడినట్లు టీజీపీఎస్సీ అధికారులు బుధవారం తెలిపారు.