calender_icon.png 18 January, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపే గ్రూప్-2 'కీ' విడుదల

17-01-2025 07:11:39 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గ్రూప్-2 ప్రాథమిక కీ(Group-2 Primary Key)ని శనివారం విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Public Service Commission)  ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 18వ తేదీ నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్ లో ప్రాథమిక కీ లోని అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా తెలపాలని టీజీపీఎస్సీ(TGPSC) పేర్కొంది. రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 1368 కేంద్రాల్లో డిసెంబర్ 15,16వ తేదీల్లో నాలుగు సెషన్లలో పరీక్షలు నిర్వహించింది. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్-3 ఆన్సర్ కీ(Group-3 Answer Key)ని విడుదల చేసింది.