14-04-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): టీజీపీఎస్సీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాన ని, క్షమాపణలు చెప్పేదే లేదని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. తాను డబ్బులు సంపాదించు కునేందుకు ఈ ఆరోపణలు చేసినట్లు నోటీ సుల్లో పేర్కొనవచ్చా అని ఆయన ప్రశ్నించా రు. తన ప్రాథమిక హక్కులను హరించిన టీజీపీఎస్సీపై తానూ పరువునస్టం దావా వేస్తానన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మీడియాతో రాకేశ్‌రెడ్డి మాట్లాడా రు.. తాను లేవనెత్తిన అంశాలపై ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పరువు నష్టం దా వా నోటీసులు పంపడం దుర్మార్గమ న్నారు.
నోటీసులకు భయపడమని చెప్పా రు. తమ భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు టీజీపీఎ స్సీకి లేదన్నారు. టీజీపీఎస్సీ తీరుపై వార్తాపత్రికల్లో కథనాలు, ఆ సంస్థ వెబ్‌సైట్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వాళ్లకు నోటీసులు పంపుతారా అని ప్రశ్నించారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హల్‌టిక్కెట్లు ఇవ్వడం కరెక్టా అని ప్రశ్నించారు. 563 మంది టాప్ ర్యాంకర్ల లో.. టాప్ 500 మందిలో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి లేరనడం తప్పా అని నిల దీశారు. నిపుణుల తో పేపర్లు దిద్దించలేదని, పేపర్లు దిద్దినవారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నోటీసులకు ౩రోజుల్లోనే సమాధానమిస్తా, వారంరోజుల్లో జాబ్ కేలం డర్ విడుదల చేస్తారా అని సవాల్ చేశారు.