calender_icon.png 6 October, 2024 | 8:43 PM

తెలంగాణ వస్తేనే.. ఉద్యోగాలు వస్తాయి : సీఎం రేవంత్ రెడ్డి

06-10-2024 06:27:32 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ వస్తేనే.. ఉద్యోగాలు వస్తాయనే సంకల్పంతో లాక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు పోరాడితేనే తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగం అంటే.. బాధ్యత మాత్రమే కాదు... ఒక ఉద్వేగం అని, తెలంగాణ పునఃనిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచారు. ఇంజనీర్ల కృషి, చిత్తశుద్ధి సమాజానికి చాలా అవసరామని, గత శతాబ్ధం, కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టులు గొప్పగా నిలబడ్డాయన్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నగర దాహార్తిని తీర్చాయి.

ఇంజనీర్ల కృషి వల్లే చార్మినార్ వంటి కట్టడం 400 ఏళ్లు దాటినా అలాగే ఉందని, చార్మినార్ ను ఆదర్శంగా తీసుకుంటారో.. కాళేశ్వరంను ఆదర్శంగా తీసుకుంటారో మీరే నిర్ణయించుకోవాలన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఎన్నో ప్రాజెక్టులు సగర్వంగా నిలబడ్డాయని, రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగింపోయందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా పనికిరావని నిపుణుల కమిటీ తేల్చిందన్నారు. భూకంపం వస్తే ప్రాజెక్టు కూలిపోయి ఊర్లకు ఊర్లు మునిగిపోతున్నాయని నిపుణులు అంటున్నారు.వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం ఒకవైపు ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశ్వాసంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందరం నిలబెట్టుకుందాం. 

తెలంగాణ ఉద్యమం అనే ముసుగు వల్ల కేసీఆర్ ఎన్నో ఏళ్లు గౌరవం పొందారని, మొన్నటి వరకు కేసీఆర్ పొందిన గౌరవం తెలంగాణ ఉద్యమం ఘనతే తప్ప ఆయన గొప్పదనం కాదన్నారు. కేసీఆర్ మీద ఉన్న ముసుగు తొలిగిపోవడంతో పదివి పోయి.. ఫామ్ హౌజ్ లో కూర్చున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలోని గంగ, యమున, కావేరి వంటి మరేన్నో నదుల పేర్లను తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్లుకున్నారని సీఎం గుర్తుచేశారు. కానీ ఇవాళ మూసీ అంటే మురికి కూపం అనే పేరుగా స్థిరపడిందని, మూసీ నిర్వాసితులకు మంచిచోటు  ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా..?, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్లలో ఎవరి భూములు పోలేదా..? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మల్లన్నసాగర్ కింద రైతులను కొట్టి, తొక్కించి బలవంతంగా ఖాళీ చేయించారు.