calender_icon.png 15 October, 2024 | 2:45 PM

Breaking News

గ్రూప్-1 పరీక్షలకు తొలగిన అడ్డంకి

15-10-2024 12:44:33 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో గ్రూప్-1కు పరీక్షకు అడ్డంకి తొలగింది. గ్రూప్-1 మెయిన్స్ పరిక్షలపై పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాన హైకోర్టు కొట్టి వేసింది. ఈనెల 21 నుంచి యథావిధిగా గ్రూప్-1 మెయిన్స్ నిర్వహంచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రిలిమ్స్ లోని 7 ప్రశ్నలకు తుది 'కీ'లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు వెల్లడించారు. ఏడు ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ కు మొత్తం 31,328 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 19న నిర్వహించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 21 నుంచి 27 వరకు తెలంగాణలో జరుగగా.. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. వీటితోపాటు జనరల్ ఇంగ్లీష్ పేపర్ రాయాల్సి ఉంటుంది.

పరీక్షల షెడ్యూల్..

జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21, 2024.

పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024.

పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23, 2024.

పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24, 2024.

పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25, 2024.

పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26, 2024.

పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27, 2024.