28-04-2025 06:06:06 PM
నల్గొండ,(విజయక్రాంతి): గ్రూప్-1 నియామకాలకు(Group-1 Recruitments) నియామక లేఖల జారీని నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్(Telangana High Court Single Bench) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana State Public Service Commission) సోమవారం అప్పీల్ దాఖలు చేసింది. టీజీపీఎస్సీ(TGPSC) దాఖాలు చేసి పిటిషన్ పై మంగళవారం హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ జరుపానుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష(Group-1 Mains Exam) మూల్యాంకన ప్రక్రయలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరూ అభ్యర్థులు హైకోర్టు(High Court) ఆశ్రయించారు.
పరీక్షల కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదన్న పిటిషనర్లు వెల్లడించారు. గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్లపై గతవారం విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం నియామకాల కోసం సర్టిఫికెట్ల పరశీలన కొనసాగించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను టీజీపీఎస్సీ సవాల్ చేస్తూ సీజే ధర్మాసనంలో పిటిషన్ దాఖాలు చేసింది. ఈ నేపథ్యం ఇవాళ గ్రూప్-1 నియామకాల అంశంపై జరగాల్సిన విచారణను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.