రెండో రోజు ఆమరణ నిరాహార దీక్షలో బక్క జడ్సన్ డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి) : నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలంగాణ వనరుల రక్షణ సేన వ్వవస్థాపక అధ్యక్షుడు, ఏపీవీసీసీ మాజీ చైర్మన్ బక్క జడ్సన్ అన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా జడ్సన్ మాట్లాడుతూ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను అడిగి పరీక్షల తేదీలను ప్రకటించబోతున్నుట్లు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఓ ఛానల్‌లో మాట్లాడారని, దీనికి బాధ్యత వహిస్తూ టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 1:100 ప్రకారం గ్రూప్ మెయిన్స్‌కు ఎంపికలు చేయాలని కోరారు. గ్రూప్ 2, 3లో 3 వేల ఉద్యోగాలను పెంచాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలన్నారు. టెట్ నార్మలైజేషన్ చేసి ఆఫ్‌లైన్‌లో పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో డౌన్ మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేయాలని కోరారు.