10-03-2025 03:45:18 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ప్రొవిజనల్ మార్కులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సోమవారం వెల్లడించింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 21 నుండి 27, 2024 వరకు నిర్వహించిన గ్రూప్-I మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. గ్రూప్-I ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల(Group-I Preliminary Exam Results) ఆధారంగా మొత్తం 31,403 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు ఎంపికయ్యారు. తాజాగా అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ప్రొవిజనల్ మార్కుల వివరాలను ప్రకటించడం ద్వారా టీజీపీఎస్సీ గ్రూప్-1 తుది నియామక ప్రక్రియను ప్రారంభించింది. వెబ్ సైట్ లో అభ్యర్థి లాగిన్ లో ప్రావిజనల్ మార్కులను www.tspsc.gov.in వెబ్‌సైట్ లో చూసుకునే అవకాశాన్ని టీజీపీఎస్సీ(TGPSC) వీలుకల్పించింది.