calender_icon.png 20 January, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీపీఈటీఏ నూతన కార్యవర్గం

20-01-2025 01:20:57 AM

హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాం తి): తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం (టీజీపీఈటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు తునికి విజయసాగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫతే మైదాన్ క్లబ్‌లో సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూత న కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా విజయసాగర్ తిరిగి ఎన్నికయ్యారు.

ప్రధాన కార్యదర్శిగా నాగరాజుగౌడ్, ట్రెజరర్‌గా జీ మనోజ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుధాకర్‌రెడ్డి,  రాష్ట్ర ఎన్నికల అధికారిగా కే శివరాజును ఎన్నుకున్నారు. సిరిసిల్లకు జిల్లా అధ్యక్షుడిగా డీ రవికుమార్, కామారెడ్డికి హీరాలాల్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పాల్గొని మాట్లాడారు.