calender_icon.png 27 October, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీపీఈఏ ఎన్నికల అధికారిగా సమ్మయ్య

27-10-2024 02:11:59 AM

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజ యక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్(టీజీపీఈఏ) సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవడానికి నవంబర్ 13వ తేదీన నిర్వహించే ఎన్నికలకు అధికారిగా కే సమ్మయ్యను నామినేట్ చేశారు. ఈ మేరకు టీజీపీఈఏ శనివారం ఒక  ప్రకటనలో తెలి పింది.

2024 నవంబర్ నుంచి 2027 నవంబర్ వరకు కొనసాగే అసోసియేషన్ కోసం ఈ ఎన్నికలు నిర్వహిం చనున్నామని పేర్కొంది. టీజీ జెన్‌కో, టీజీ ట్రాన్స్‌కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్‌లో పనిచేస్తున్న అసిస్టెం ట్ ఇంజినీర్ కేడర్ నుంచి చీఫ్ ఇంజినీర్ వరకు అందరూ ఎన్నికల ప్రక్రి యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.