calender_icon.png 18 January, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు టీజీవో డైరీ ఆవిష్కరణ

18-01-2025 02:09:34 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17(విజయక్రాంతి): టీజీవో హైదరాబాద్ జిల్లా సంఘం డైరీని శనివారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఆవిష్కరిస్తామని ఆ సంఘం అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాదర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ప్రత్యేక అతిథిగా టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు హాజరవుతారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.