calender_icon.png 28 April, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డిలో టీజీజేఏసీ కొవ్వొత్తుల ర్యాలీ

28-04-2025 01:03:11 AM

ఉగ్రవాదాన్ని తుద ముట్టించాలి: చైర్మన్ జావేద్ అలీ

సంగారెడ్డి, ఏప్రిల్ 27 ( విజయ క్రాంతి): జమ్ము కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా టిజిఈ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సంగారెడ్డిలోని  స్థానిక IB నుండి కొత్త బస్టాండ్ వరకు వారికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ , నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో సంగారెడ్డికి సంబంధించిన ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు,  రిటైర్డ్ ఉద్యోగులు,  అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షన్ల సంఘ ఉద్యోగులు, జిల్లా కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీజీఏసి చైర్మన్ ఎండి జావేద్ అలీ  మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. దేశంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమూలంగా తుద ముట్టించాలని, దీనిపైన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచారు.

ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

చేగుంట, ఏప్రిల్ 27 : కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా చేగుంట మండల పరిధిలో ని చందాయిపేట  గ్రామస్తులు ఆదివారం  రాత్రి క్రొవొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి చర్యలు ఇక ముందు జరుగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టిగా జవాబు చెప్పాలన్నారు. మృతు లకు శాంతి చేకూరాలనీ, వారి కుటుంబాలకు  ధైర్యం ప్రసాదించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల అధ్యక్షులు, మైనార్టీ నాయకులు  పాల్గొన్నారు.