calender_icon.png 3 November, 2024 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీఐఐసీ టార్గెట్ రూ.10వేల కోట్లు

06-07-2024 01:33:32 AM

  • ఫండ్ మొబిలిటీ కోసం లక్ష్యాన్ని నిర్దేశించిన సర్కార్
  • భూములను గుర్తించే పనిలో కార్పొరేషన్
  • భూములను కుదవపెట్టి అప్పులు
  • ఇప్పటికే రూ.5వేల కోట్లకు టెండర్లకు అహ్వానం

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): రైతు రుణమాఫీ సహా ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధుల వేటలో నిమగ్నమైంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే శాఖలు, వివిధ కార్పొరేషన్లకు నిధుల సేకరణలో టార్గెట్ విధించింది. ఇందులో భాగంగా తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ)కు రూ.10వేల కోట్లను ప్రభుత్వం టార్గెట్‌గా విధించినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో తమ పరిధిలోని భూములను ప్రైవేటు ఆర్థిక సంస్థలు లేక బ్యాంకులకు కుదవపెట్టి లోన్లు తేచ్చేందుకు టీజీఐఐసీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే టీజీఐఐసీ పరిధిలో కొంత భూమి సిద్ధంగా ఉండగా మరికొంత భూమి ని గుర్తించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో పారి శ్రామిక పార్కులు అభివృద్ధి కోసం టీజీఐఐసీ ద్వారా రుణాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రుణాలను పారిశ్రామిక అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. భూములను చదును చేయడం, మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ, పవర్ సప్లు వంటి సౌక ర్యాలను కల్పించేందుకు ఈ రుణాలను వెచ్చించాల్సి ఉంటుం ది. ప్రస్తుతం తీవ్రమైన నిధుల కొరతతో ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అప్పులు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ క్రమంలో టీజీఐఐసీ ద్వారా అప్పులు సులువుగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ కార్పొరే షన్‌కు రూ.10వేల కోట్లను టార్గెట్‌గా విధించింది.

భూ కేటాయింపులు వేగంగా..

అప్పుల రూపేణా మాత్రమే కాకుండా, పరిశ్రమలకు భూములను కేటాయిచండం ద్వారానూ ఆదాయాన్ని పొందాలని టీజీఐఐసీ చూస్తోంది. ఈ క్రమంలో అర్హులైన సంస్థలకు ఆలస్యం చేయకుండా, వీలైనంత త్వరగా భూములు కేటాయింపులు జరగాలని ప్రభు త్వం సూచించిన నేపథ్యంలో టీజీ ఐఐసీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గత మూడు నెలల్లో ఏకంగా 113 కంపెనీలకు భూములను కేటాయించింది. ఇందులో సింహభాగం ఎంఎస్‌ఎం ఈలకే కేటాయించింది. ఈ పరిశ్రమల ద్వారా రూ .2,200కోట్ల పెట్టుబడులు వ చ్చాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అర్హులైన కంపెనీలకు భూముల కేటాయింపులను మరింత వేగవంతం చేయాలని సర్కారు టీజీఐఐసీ భావిస్తోంది.

800 ఎకరాలే లక్ష్యం..

బ్యాంకులు, మర్చంట్ల వద్ద కుదవపెట్టడం కోసం, పరిశ్రమలకు కేటాయించడం కోసం దాదాపు 800 ఎకరాలను టీజీఐఐసీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రంగారెడ్డితో పాటు మేడ్చల్ జిల్లాలో అన్వేషణ చేపట్టినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం టీజీఐఐసీని ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా కార్పొరేషన్ ముం దుకు సాగుతోంది.

అర్జెంట్‌గా రూ.5వేల కోట్లు

వార్షిక టార్గెట్ రూ.10వేల కోట్లు కాగా వీలైనంత తొందరగా రూ.5వేల కోట్లను సమీకరించాలని టీజీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రుణాల కోసం ప్రభుత్వ పూచీకత్తుతో కొన్ని భూములను తాకట్టు పెట్టేందుకు ప్రైవేటు మర్చంట్లు, బ్యాంకుల నుంచి టెండర్లను ఆహ్వానించింది. జూలై 1 నాటికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలో ఆగస్టు 15 నాటికి రూ.5వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా అటు టీజీఐఐసీ, ఇటు ప్రభుత్వం పావులు కదుపుతోంది.