ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కోటి విరాళం
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణలో భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాలు అతలాకుతలమైన నేపథ్యంలో వివిధ సంస్థలు, ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మొదలైన వారెందరో ఆపన్నహస్తం అందించేందుకు ముం దుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్దఎత్తున సాయం చేస్తూ తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. శుక్రవారం తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరే షన్ (టీజీఎఫ్‌డీసీ) సైతం ముందుకు వచ్చి తమ సేవా నిరతిని చాటుకుంది.
రూ. 2 కోట్ల చెక్కును కార్పొరేషన్ తరఫున సీఎం సహాయనిధికి అందించారు. ఈ మేరకు టీజీఎఫ్‌డీసీ చైర్మన్ పొదెం వీరయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందచేశారు. మిగతా కార్పొరేషన్లు సైతం టీజీఎఫ్‌డీసీ బాటలో నడవాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కంపెనీ ఎండీ రాయల రఘు... సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ కంపెనీ సాయంగా రూ. కోటి విలువైన చెక్కును అందించారు.