calender_icon.png 15 March, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ మోసం ప్రయత్నాన్ని నిరోధించిన టీజీసీఎస్‌బీ

15-03-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి14(విజయక్రాంతి)  : నగరంలోని ఓ కంపెనీ నుంచి రూ.1.95 కోట్లు కొల్లగొట్టేందుకు జరిగినసైబర్‌మోసం ప్రయత్నాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) నిరోధించిందని ఆ సంస్థ డీజీ షికాగోయల్ తెలిపారు.  ఆమె తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 13న నగరంలోని ఓ కంపెనీలో పని చేసే అకౌంట్స్ ఆఫీసర్‌కు అతను పని చేసే కంపెనీ సీఎండీ వాట్సప్ ప్రొఫైల్ ఫొటోతో వాట్సప్ మెసేజ్ వచ్చింది.

కొత్త ప్రాజెక్టు కోసం  రూ.1.95కోట్లు ట్రాన్సఫర్ చేయమని ఆ మెసేజీ సారాంశం. సీఎండి ప్రోఫై ల్ ఫోటో ఉండటంతో నమ్మిన అకౌం ట్స్ ఆఫీసర్ రూ.1.95కోట్లను వాట్స ప్  మేసేజ్  నుంచి వచ్చిన అకౌంట్‌కు ట్సాన్సఫర్ చేశాడు.  డబ్బులు ట్రాన్సఫర్ చేసినట్లు కంపెనీ సీఎండి కి నోటిఫికేషన్  మెసేజ్ రావడంతో  అకౌంట్స్ ఆఫీసర్ ను వివరాలు అడిగాడు.

వాట్సప్ మేసేజ్  ఆధారంగా బదిలీ జరిగిందని తెలుసుకున్న సీఎండి, తాను ఎలాంటి మెసేజ్ పంపలేదని నిర్ధారించుకుని సైబర్ మోసం జరిగినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)లో ఫిర్యాదు చేశాడు.  మార్చి  13వ తేదిన మధ్యాహ్నం 2:51 గంటలకు ఫిర్యాదు అందిన వెంటనే, ఎన్సీఆర్పీ  కాల్ సెంటర్ అధికారులు  ఫిర్యాదు దారుని సంప్రదించి బ్యాంక్ నోడల్ అధికారుల వివరాలు సేకరించి సైబర్ మోసగాళ్ళు ఆ డబ్బును విత్ డ్రా చేయకముందే, అకౌంట్ హోల్డ్‌లో పెట్టారు.

రూ.1.95 కోట్లు సైబర్ నేరగాళ్ల భారిన పడుకుండా చర్యలు తీసుకున్నారు. కాగా వాట్సా ప్, ఇమెయిల్, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే ఆర్థిక అభ్యర్థనల పట్ల జాగ్రత్తగా ఉండాలని  టీజీసీఎస్బీ డీజీ  శిఖా గోయాల్ సూచించారు. లావాదేవీలు చేసే ముందు అథరైజ్డ్  కమ్యూనికేషన్ ద్వారా చెల్లింపులు ధ్రువీకరించు కుని చేయాలని సూచించారు. సైబర్  మోసాన్ని గుర్తించినట్లయితే, 1930 సైబర్ హెల్ప్‌లైన్, www.cyber crime.gov.in లో వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.