calender_icon.png 5 February, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ ఫలితాలు వచ్చేశాయ్

05-02-2025 07:37:49 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Telangana Teacher Eligibility Test) ఫలితాలను తెలంగాణ స్కూల్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(Telangana Director of School Education) బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 20వ తేవదీ వరకు టీజీ టెట్ పరీక్షను నిర్వహించబడింది. ఈ పరీక్షకు మొత్తం 1,35,802 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం అభ్యర్థులలో 31.21% మంది అంటే 42,384 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించారని అధికారులు వెల్లడించారు.  పేపర్ -1 లో 69, 476 మంది పరీక్ష రాస్తే 41 ,327 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 లో మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 69,390 మంది పరీక్ష రాస్తే 23,755 మంది ఉత్తీర్ణత సాధించారు. సోషల్ స్టడీస్ పేపర్ లో 66,412 మంది ఎగ్జామ్ రాస్తే 18,629 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 1 అండ్ 2 లో కలిపి 1,35,802 మంది పరీక్షలు రాస్తే 42,384 మంది ఉత్తీర్ణత సాధించారు. టెట్ ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ లోను అందుబాటులో ఉంచారు.

టెట్ రెండు పేపర్ల ఫలితాలను https://tgtet2024.aptonline.in/tgtet/ResultFront అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మనబడి తెలంగాణ టెట్ ఫలితంతో పాటు టీజీ టెట్ స్కోర్‌కార్డ్ కూడా విడుదల చేయబడింది. స్కోర్‌కార్డ్‌లో అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కులు ఉంటాయి. టీజీ టెట్ ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి జర్నల్ నంబర్/హాల్ టికెట్ నంబర్, అప్లైడ్ ఎగ్జామ్ పేపర్, పుట్టిన తేదీ లాగిన్ ఆధారాలను ఉపయోగించాలి. తెలంగాణ టెట్ రెండు పేపర్లను కలిగి ఉంటుంది. 1 నుండి 5 తరగతులకు ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులు పేపర్ 1ను, 6 నుండి 8 తరగతులకు బోధించాలనుకునే వారు పేపర్ 2ని ఎంచుకోవాలి. ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియలో టెట్ స్కోర్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇకపై టెట్ పరీక్షను ఏటా నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.