23-02-2025 01:04:48 PM
చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, వెలుగు పాఠశాలలో ఆదివారం టీజీ సెట్ పరీక్షలు(TG SET Exams) జరుగుతున్నాయి. అయితే ఈ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఓ విద్యార్థి ఒక సెంటర్ కి బదులుగా మరొక సెంటర్ కు వెళ్లారు. పరీక్ష సమయం ఆసన్నం కావడంతో అక్కడ ఉన్న పోలీసులు మానవ దృక్పథంతో విద్యార్థిని సదరు సెంటర్ కు తమ సొంత వాహనాలపై చేర్చారు. దీంతో చిట్యాల పోలీసుల సేవలను మండల ప్రజలు హర్షిస్తున్నారు.ఈ కార్యక్రమం లో ఏఎస్ఐ సమ్మిరెడ్డి, నాగ రాజు, రమణ పాల్గొన్నారు