calender_icon.png 3 April, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీ క్యాబ్ 82వ పాలకవర్గ సమావేశం

28-03-2025 12:54:23 AM

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ 82వ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీందర్‌రావు, వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య పాల్గొన్నారు. సమావేశంలో ఆర్థిక లావాదేవీలపై, టర్నోవర్స్, జిల్లాలోని డీసీసీబీల పనితీరు, పురోగతి, ఐటీ రంగం, నెట్‌వర్క్, డిపాజిట్స్ ఎడ్యుకేషనల్ అవర్నెస్, ఆర్బీఐ, నాబార్డ్ సర్క్యూలర్ల అమలు, వ్యవసాయ రుణాలు, రైతు రుణమాఫీపై  సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో టీజీక్యాబ్ ఎండీ గోపి, డైరెక్టర్లు కుంభం శ్రీనివాస్‌రెడ్డి, అడ్డి బోజారెడ్డి, మామిల్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, దొండపాటి వేంకటేశ్వర రావు, చిట్టీ దేవేందర్‌రెడ్డి, కుంట రమేష్‌రెడ్డి, ప్రొఫెషనల్ డైరెక్టర్లు శ్రీనివాసులు, మోహన్ ఐయర్, అడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, నాబార్డ్ సీజీఎం ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు.