calender_icon.png 24 October, 2024 | 10:48 AM

సీఎంను కలిసిన టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు

02-08-2024 12:05:00 AM

తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు భరత్ భూషణ్. ఈ సందర్భంగా ఆయన గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇద్దరూ గద్దర్ అవార్డ్స్ గురించి చర్చించుకున్నారు. తన అమెరికా పర్యటన తర్వాత మూవీ ఇండస్ట్రీ మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం కావాలో చర్చిద్దామని సీఎం చెప్పారని భరత్ భూషణ్ తెలిపారు.