calender_icon.png 30 April, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠ్య పుస్తకాలు సిద్ధంగా ఉంచాలి

30-04-2025 12:00:00 AM

జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య 

మందమర్రి, ఏప్రిల్ 29 : 2025-26 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటి కి మండలంలోని విద్యార్థులంద రికీ పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని జిల్లా విద్యాశా ఖ అధికారి యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేం ద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి ఆన్ లైన్ లో విద్యార్థుల వివరాల నమోదును  పరిశీలించారు.

విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలలో పుస్తకాలు,  ఏకరూప దుస్తులను విద్యార్థులను అందించేందుకు సిద్ధంగా ఉంచాలని మండల విద్యాధికారికి సూచించారు.

అనంతరం విద్యార్థులకు అం దించే ఏకరూప దుస్తుల తయారు కేంద్రాన్ని ఆయన పరిశీలించి దుస్తులను నాణ్యతతో కూడిన దుస్తులను కొలతల ప్రకారం  విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్ర మంలో సెక్టోరియల్ అధికారి చౌదరి, మండల విద్యాధికారి రత్తమూర్తి, ఎం ఆర్ సి సిబ్బంది పాల్గొన్నారు.