29-04-2025 07:05:53 PM
జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య...
మందమర్రి (విజయక్రాంతి): 2025-26 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మండలంలోని విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య(District Education Officer Yadaiah) అన్నారు. మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి ఆన్ లైన్ లో విద్యార్థుల వివరాల నమోదును పరిశీలించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలలో పుస్తకాలు, ఏకరూప దుస్తులను విద్యార్థులను అందించేందుకు సిద్ధంగా ఉంచాలని మండల విద్యాధికారికి సూచించారు. అనంతరం విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారు కేంద్రాన్ని ఆయన పరిశీలించి దుస్తులను నాణ్యతతో కూడిన దుస్తులను కొలతల ప్రకారం విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి చౌదరి, మండల విద్యాధికారి రత్తమూర్తి, ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు.