calender_icon.png 6 February, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు టీఈటీఎస్‌ఏ మద్దతు

06-02-2025 12:04:28 AM

  1. మార్చి 2న యూపీఎస్‌పై యుద్ధభేరి
  2. రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వెల్లడి

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాం తి): ఫిబ్రవరి 27న జరగనున్న వరంగల్- - ఖమ్మం -- నల్గొండ, కరీంనగర్ - మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఎంప్లాయీస్ యూనియన్ అభ్యర్థులు డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, తిరుమలరెడ్డి ఇన్నారెడ్డిలకు తెలంగాణ ఉపాధి, శిక్షణ ఉద్యోగుల సంఘం (టీఈటీఎస్‌ఏ) సంపూర్ణ మద్దతు తెలిపింది.

ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని సీపీఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ర్ట అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్‌లకు వారు మద్దతు లేఖలు అందించారు. ఈ సందర్భంగా టీఈటీఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు ప్రధాన ధ్యేయంగా, ఏప్రిల్ 1 నుంచి రాబోతున్న యూపీఎస్‌ను అడ్డుకోవడానికి చట్టస భల్లో సీపీఎస్ యూనియన్ ఎమ్మెల్సీల గెలు పు ఆవశ్యకమన్నారు.

శిక్షణాధికారులందరూ వెంకటస్వామి, ఇన్నారెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంత రం మార్చ్ 2న తలపెట్టిన యూపీఎస్‌పై యుద్ధభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో శ్యాంసుందర్, రేవంత్‌కుమార్, రవి, సుదర్శన్, వెంకటేశ్వరరావు, రితిక, సీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ పాల్గొన్నారు.