- అదే రోజు నెట్ పరీక్ష
- ప్రభుత్వాన్ని కోరుతున్న అభ్యర్థులు
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష)ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. అదేవిధంగా నేషనల్ ఎలిజిబిలిటీ పరీక్షలు కూడా జనవరి 1 నుంచి 19 వరకు ఉన్నాయి. ఒకే తేదీల్లో టెట్, నెట్ పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. టెట్ పరీక్షను వాయిదా వేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టెట్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువు ఇటీవలే ముగిసింది.