calender_icon.png 6 February, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ ఫలితాలు విడుదల

06-02-2025 12:55:16 AM

  1. పేపర్-1లో 59.48%
  2. పేపర్-2లో 31.21% అర్హత
  3. గతం కంటే తగ్గిన ఉత్తీర్ణత

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): టెట్ (టీచర్ ఎలిజబులిటీ టెస్ట్) - 2024 ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణాతో కలిసి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నర్సింహారెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ ఫలితాలను విడుదల చేశారు.

పేపర్-1లో 59.48 శాతం, పేపర్-2లో 31.21 శాతం మంది అర్హత సాధించారు. పేపర్-1కు 69,476 మంది హాజరుకాగా 41,327 (59.48 శాతం) మంది అర్హత సాధించారు. పేపర్ 69,390 మంది మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్ష రాయగా, 23,755 (34.24 శాతం) మంది, సోషల్ స్టడీస్ పేపర్‌కు 66,412 మంది హాజరుకాగా, 42,384 (28.05 శాతం) మంది అర్హత సాధించారు.

మొత్తంగా పేపర్-2లో 31.21 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1, పేపర్-2కు కలిపి మొత్తం 2,05,278 మంది పరీక్షలకు హాజరైతే అందులో 83,711 మంది ఉత్తీర్ణత సాధించారు. టెట్ ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉం చినట్లు అధికారులు తెలిపారు.

రెండు పేపర్లను ఏడు భాషల్లో, 20 సెషన్‌లలో సీబీటీ పద్ధతిలో నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే గతేడాది మే, జూన్‌లో జరిగిన టెట్‌లో కంటే ఈసారి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. 2024లో పేపర్-1 లో 67.13 శాతం మంది, పేపర్-2లో 34.18 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సారి పేపర్-1లో 59.48 శాతం, పేపర్-2లో 31.21 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు.