11-04-2025 07:41:20 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో ఏడాదికి రెండుసార్లు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Telangana Teacher Eligibility Test) పరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ(School Education Department) టెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వెబ్ సైట్ లో ఈనెల 15 నుంచి నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. గతేడాది డిసెంబర్ లో టెట్ నోటిషికేషన్ విడుదల చేసి ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. జనవరిలో జరిగిన టెట్ పరీక్షకు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు.