* 27 వరకు అభ్యంతరాలు స్వీకరణ
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రాథమిక కీని శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ నెల 2 నుంచి 20 వర కు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో టెట్ నిర్వహించారు.
టెట్‌కు 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే, 2,05,278 (74.44 శాతం) మంది రాయగా, 70,475 మంది గైర్హాజరయ్యారు. కీపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత టెట్ ఫలితాలను విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు.