calender_icon.png 6 January, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి టెట్

01-01-2025 12:22:35 AM

  • పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్

హాజరుకానున్న 2.75 లక్షల మంది

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాం తి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జన వరి 2 నుంచి 2౦ వరకు పది రోజులపాటు 2౦ సెషన్లలో నిర్వహించనున్నది. ఈ పరీక్షలకు 2,75,773 మంది హాజరుకానున్నా రు. టెట్ రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.

ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, సెషన్  మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పేపర్ పరీక్షలను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్ -2 పరీక్షలు జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో ఉంటుంది. 

మెహందీతో వస్తే అనుమతి ఉండదు

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు పలు సూచనలు చేశారు. మెహం దీతో వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఇప్పటికే స్పష్టంచేశారు. స్మార్ట్ వాచీలతోపాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు. హాల్‌టికెట్లపై సూచించిన నిబంధనలను అభ్యర్థులు తప్పకుండా పాటించాలని సూచించారు.

పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు రెండు గంటల ముం దే చేరుకోవాలని కోరారు. ఉదయం సెషన్ కు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 7.30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం సెషన్‌కు హాజరయ్యే వారిని మ.12.30 గంటల నుంచి లోనికి అనుమతిస్తారు.- పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లను మూసివేస్తారు. 

సెషన్ ఉ.8.45 గంటలకు, సెషన్ మధ్యాహ్నం 1.45 గంట లకు గేట్లను మూసివేయనున్నారు.- అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తిం పు కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ)లను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

దూర ప్రాంతాల్లో సెంటర్లు...

ఇదిలా ఉంటే ఆప్షన్ పెట్టుకున్న జిల్లాలకే కాకుండా పెట్టని జిల్లాల్లోనూ సుదూర ప్రాం తాల్లో పరీక్షా కేంద్రాలు పడటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక జిల్లాల నుంచి 100 నుంచి 300 కిలోమీటర్ల వరకు దూరంలో సెంటర్లు పడటంతో ఎలా వెళ్లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోగా, పక్క జిల్లాలను కేటాయించారని మండిపడుతున్నారు. అంతంత దూరం వెళ్లి పరీక్షలు ఎలా రాయాలని నిలదీస్తున్నారు.