- 20 వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు
- హాజరుకానున్న 2,75,753 మంది అభ్యర్థులు
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రతిరోజు రెండు సెషన్‌లలో పరీక్ష లు జరగనున్నాయి. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. టెట్‌కు 2,75,753 మంది హాజరుకానున్నారు.
పేపర్-1ను 94,327 మంది, పేపర్-2 ను 1,81,426 మంది అభ్యర్థులు రాయనున్నారు. మొత్తం 17 జిల్లాల్లో 92 పరీక్ష కేం ద్రాలను ఏర్పాటు చేశారు. పది రోజులుపాటు మొత్తం 20 సెషన్‌లలో పరీక్షలు జరగనున్నాయి. సెషన్-1 ఉదయం 9 నుం చి 11.30 గంటల వరకు, సెషన్- -2 మధ్యా హ్నం 2 నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్టు అధికారులు వివరించారు.
పేపర్--1ను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో, పేపర్--2ను జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. గతేడాదిలో టెట్‌ను మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహించారు.
పాటించాల్సిన నిబంధనలు
-ఉదయం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థుల ను ఉదయం 7.30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం సెషన్‌కు హాజరయ్యేవారిని 12.30 గంటల నుంచి అనుమతించనున్నారు.- పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే కేంద్రం గేట్లను మూసివేయనున్నారు.
ఉదయం సెషన్‌లో ఉ.8.45కు, మధ్యాహ్నం సెషన్‌లో 1.45 గంటలకు గేట్లను మూసివేయనున్నారు.- అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తోపాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ) తమ వెంట తీసుకెళ్లాలి. -స్మార్ట్ వాచీలతోపాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతించరు.