calender_icon.png 21 January, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన టెట్ పరీక్షలు

21-01-2025 01:09:26 AM

  1. 70,475 మంది గైర్హాజరు
  2. 24న కీ విడుదల 

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు సోమవారంతో ముగిసాయి. ఈ నెల 2 ప్రారంభమైన పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగాయి. ఈ పరీక్షలకు మొత్తం 70,475 మంది గైర్హాజరయ్యా రు. పేపర్-1కు 94,327 మంది దరఖాస్తు చేసుకోగా 69,476 (73.65 శాతం) మంది హాజరయ్యారు. 24,851 మంది పరీక్షలు రాయలేదు.

పేపర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పరీక్షకు 93,263 దరఖాస్తులు రాగా 69,390 (74.40 శాతం) మంది హాజరుకాగా, 23,873 మంది గైర్హాజరయ్యారు. పేపర్-2 సోషల్ స్టడీస్ పరీక్షకు 88,163 మంది అప్లయ్ చేయగా 66,412 (75.33 శాతం) మం ది పరీక్షలు రాశారు. 21,751 మంది రాయలేదు.

మొత్తంగా 2,75,753 మందికిగానూ 2,05,278 (74.44 శాతం) మంది పరీక్షలు రాయగా, ఈ నెల 24న కీ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కీపై అభ్యంతరాలుంటే ఈనెల 24 నుంచి 27  వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాలని అభ్యర్థులకు సూచించారు.