హాజరు అంతంత మాత్రమే
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. జూన్ 24 నుంచి 29 వరకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సం బంధించిన పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో సీబీఆర్‌టీ (ఆన్‌లైన్) విధానంలో నిర్వహించారు. ఉదయం సెషనల్‌లో 1,45,359 మందికిగానూ 82,737 (56.92 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌కు 1,45,534 మందికిగానూ 82,873 (56.94 శాతం) మంది హాజరయ్యారు. ఇక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షలు జూన్ 30 నుంచి జూలై 4 వరకు నిర్వహించారు. ఉద యం జరిగిన సెషన్‌లో 1,06,253 మందికిగానూ 36,209 (34.08 శా తం) మంది హాజరవ్వగా, మధ్యాహ్నం జరిగిన సెషన్‌లో 35,833 (33.72 శాతం) మంది హాజరయ్యారు.