calender_icon.png 6 January, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6 నెలలకోసారి పరీక్షలు తప్పనిసరి

01-01-2025 01:34:42 AM

  • పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి 

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, డిసెంబర్31(విజయక్రాంతి): మహిళలందరికీ ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారు లను ఆదేశించారు. మానకొండూర్, శంకర పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం సందర్శించి అక్కడ నిర్వహి స్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని పరిశీ లించారు.

ఆరోగ్య మహిళ ద్వారా పరీక్షలు చేయించుకుంటున్న వారి వివరాల రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రసూతి గది, ఆపరేషన్ థియేటర్ ల్యాబ్, వార్డులను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య మహిళ కార్య క్రమంలో పరీక్షల వేగం పెంచి నిర్దిష్ట లక్ష్యా న్ని చేరుకోవాలని ఆదేశించారు.

మహిళలం దరికీ వైద్య పరీక్షలు పూర్తి చేయాలని,  ఆరు నెలలు దాటిన వారికి మరో దఫా పరీక్షలు ప్రారంభించాలని అన్నారు. ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నందున ఇన్ పేషెంట్ సంఖ్య పెంచాలని తద్వారా ప్రధాన ఆసుప త్రికి రోగుల తాకిడిని తగ్గించాలని ఆదేశిం చారు.

పీహెచ్సీలలో టీవీలు, సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని, రోగుల ఫోన్ నెంబర్లు విధిగా నమోదు చేసి వారికి ఆరోగ్య సమాచారం ఇవ్వాలని అన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకట రమణ, మెడికల్ ఆఫీసర్లు శ్రవణ్ కుమార్, సౌమ్య పాల్గొన్నారు.