calender_icon.png 23 April, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్ష కేంద్రం తాగునీటి కటకట

22-04-2025 11:34:49 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఓపెన్ ఇంటర్ పరీక్ష రాసే అభ్యర్థులు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగజ్ నగర్ జెడ్పిఎస్‌ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రంలో అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు తాగునీరు అందించడంలో అలసత్వం వహిస్తున్నారు. వేసవికాలంలో పరీక్షలు రాసేవారికి చల్లని తాగునీరు ఏర్పాటు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.