calender_icon.png 24 February, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు టెస్లా కార్లు

19-02-2025 11:04:28 PM

ఏప్రిల్‌లో విక్రయాలు..!

న్యూఢిల్లీ: దిగ్గజ ఈవీ కంపెనీ టెస్లా.. భారత్‌లో తమ కార్ల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ భారత్‌లో నియామకాలు చేపట్టింది. షోరూంల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భారత మార్కెట్లలోకి టెస్లా ఈవీ కార్లు రానున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.21 లక్షలుగా ఉండనుంది. ప్రస్తుతానికి కంపెనీ రిటైల్ కార్యకలాపాలనే ప్రారంభించినట్లు సమాచారం. జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి ఈవీ కార్లను దిగుమతి చేసుకునేందుకు టెస్లా సిద్ధమైంది. కాగా షోరూం ఏర్పాటుకు ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్, న్యూఢిల్లీలోని ఏరోసిటీ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.