బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రామాయణ్’. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తుండగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. ఇంద్రుడు పాత్రను కునాల్ కపూర్ పోషిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి మరో అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’, ‘అవతార్’, ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల కోసం పనిచేసిన ప్రఖ్యాత స్టంట్ కోఘూ టెర్రీ నోటరీ.. యాక్షన్ డైరెక్టర్‌గా ‘రామాయణ్’ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిస్తూ ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేశారు. “భారతదేశంలో ఇది నా మొదటి ప్రాజెక్టు ఇది. నేను ‘రామాయణ్’ కోసం సుమారు ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్నాను” అని నోటరీ పేర్కొన్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ‘రామాయణ్’ పార్ట్ 2026లో విడుదల కానుందని, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే దసరా, దీపావళి వచ్చే అవకాశం ఉందనేది బాలీవుడ్ వర్గాలు చెప్తున్న మాట.