calender_icon.png 28 April, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదులను వెంటనే ఉరితీసి చంపేయాలి

24-04-2025 04:50:21 PM

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి..

మునగాల: జమ్మూ కశ్మీర్ పహల్గాంలోని బైసరన్ మైదాన‌ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టులకు కాల్చి చంపడం దారుణం అని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది క్షమించారని నేరం భారతదేశంలో ఎంతో శాంతిని సర్వమత సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శిస్తుంటే కొన్ని విదేశీ శక్తులు భారత్ పై పగతో రాజకీయంగా ఏం చేయలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండడం సిగ్గుచేటని అన్నారు.

ఇలాంటి ఘటనలతో భారత్ ఆత్మస్థైర్యం దెబ్బ తీయలేరని ప్రతి పౌరుడు పంజా బిగించి ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత్ సిద్ధంగా దన్నారు. రక్తపాతంతో రాజకీయాలను శాసించలేరని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భారత్ లో ఉగ్రవాదుల పొరపాటును వెంటనే నిర్మూలించాలని ఉగ్రవాదులను గుర్తించి వారిని ఏరి పారేయాలని సూచించారు. భారత్ ఎంతో సమనయంతో ప్రపంచంలోని ఒక గొప్ప శాంతియూత, దేశంగా వర్ధిల్లుతుందని దీనిని దెబ్బతీయాలని కొన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నయని ఇలాంటి వారి ఆటలు కొనసాగనివ్వవద్దని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు ఇంకా ఎక్కడ లేకుండా ఏరి పారేయాలని కోరుతున్నాను. దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని సాయి కోరారు.