calender_icon.png 25 April, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదులను ఉరితీయాల్సిందే..

25-04-2025 07:47:38 PM

పాల్వంచ జమా మస్జిద్ కమిటీ..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): శుక్రవారం పాల్వంచ జమా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ... మనిషిని చంపమని ఏ ధర్మమూ చెప్పదని అలా కాదని మనుషుల్ని ఎవరైతే హతమారుస్తారో వారు ఇస్లాం ధర్మ వ్యతిరేకులని వారిని అల్లా క్షమించడన్నారు. అమాయకమైన ప్రజలపై దాడి చేసి హతమార్చిన ఉగ్రవాదులను ముమ్మాటికి బహిరంగంగా ఉరి తీయాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జమా మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఫయాజుల్ హస్సన్, కార్యదర్శి ఇబ్రహీం ఖురేషి, ఖాజా అహ్మద్, అక్బర్, మస్తాన్ ఖురేషి, ఫక్రుద్దీన్, రహీమ్, ఫారూఖ్, హన్ను, మత గురువులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.