29-04-2025 10:40:01 PM
చైతన్యపురిలో నిరసన ర్యాలీ...
ఎల్బీనగర్: ఉగ్రవాదులను మట్టుపెట్టాలని, ఉగ్రవాదాన్ని సృష్టిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా అన్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మంగళవారం చైతన్యపురి డివిజన్ ప్రజలు నిరసన ర్యాలీ నిర్వహించారు. చైతన్యపురి డివిజన్ లోని ప్రభాత్ నగర్ కాలనీ, సాయినగర్ కాలనీ, చైతన్యపురి ప్రజలందరూ కలిసి ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ప్రభాత్ నగర్ పార్క్ నుంచి బాబు కాంప్లెక్స్, సత్యనారాయణపురం మీదగా సాయినగర్ శివాజీ బొమ్మ వరుకు సుమారు 300 మంది ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని, కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ర్యాలీలో కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా పాల్గొని.. దేశ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.