26-04-2025 12:06:42 AM
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 25 ,(విజయక్రాంతి) పెహల్గాంలో జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి భారతదేశ సమగ్రత, సమైక్యతను, మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రని, ఈ కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, ఉర్దూ ఘర్ చైర్మన్ నయీమ్ ఖురేషి, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, ఆళ్ల మురళి అన్నారు.
పెహల్గాంలో యాత్రికులపై జరుగిన టెర్రరిస్టుల దాడికి నిరసనగా, మృతులకు నివాళులర్పిస్తూ కొత్తగూడెం ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటి ఆధ్వర్యంలో శుక్రవారం రైల్వే స్టేషన్ సెంటర్లో మానవాహారం నిర్మించి మృతులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ జమ్ము-కాశ్మీర్ భారత భూభాగంలో అంతర్భాగమే నని, ఎప్పటికీ దేశం నుంచి వేరుచేయలేరన్నారు.
కాశ్మీర్ సమస్యను ఆసరాగా చేసు కుని పాక్ ఉగ్రవాదులు అమాయక ప్రజలపై దాడులకు తెగబడటం దుర్మార్గమ న్నారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అత్యంత హేయమని అన్నారు. ఉగ్రవాదానికి మతం రంగు పులిమి దేశాన్ని విచ్చిన్నం చేయాలనే వారి ఆకాంక్షను నెరవేరనివ్వబోమని స్పష్టం చేశారు. కార్యక్ర మంలో జేఏసీ ఉమర్ ఫరూక్, అబ్దుల్ రబ్, ఎండి షరీఫ్, ఎండి అబిద్, అమీర్ ఖాద్రి, జావేద్, ఎండి అయూబ్, అన్వర్ పాల్గొన్నారు.
ఉగ్రవాదంపై సీపీఐ ఉవ్వెత్తున నిరన
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 25 (విజయక్రాంతి) జమ్మూ-కాశ్మిర్ పెహల్గామ్ పర్యాటక ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సిపి ఐ జిల్లా కార్యాలయం ’శేషగిరిభవన్’ నుంచి బస్టాండు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద ఉగ్రదాడిని కండిస్తూ మానవాహారం నిర్మించి నినాదాలు చేశారు, మృతులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ ఉగ్రవాదులు దేశపౌరులపై జరిగిపిన జరిపిన దాడి, హత్యాకాండ పిరికిపంద చర్యని, ఈ చర్యను భారత పౌరసమాజం సహించబోదన్నారు. ఉగ్రవాదానికి మతం ఉండదని, పహాల్గమ్లో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా చంపేశారని, అత్యంత ఘోరమైన మరణహోమాన్ని కూడా రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూసే దుర్మార్గుల పన్నాగాలను ప్రతి ఒక్కరు ఖండించా లన్నారు.
వారం రోజుల క్రితమే పాకిస్థాన్ సైన్యాధికారు, ఉగ్రవాద కమాండర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నప్పటికీ వాటిని పసిగట్టడంలో కేంద్ర బలగాలు, ప్రభుత్వం ఎందుకు ఫైఫల్యం చెందారో దేశ ప్రజలకు బిజెపి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఇంటిలిజెన్స్ సంస్థ దాడుల విషయాన్ని ముందే కేంద్రానికి , ఈ దాడికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
కేంద్రప్రభుత్వం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, కె సారయ్య, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, మునిగడప వెంకటేశ్వర్లు ఎస్ కె ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు.