calender_icon.png 17 January, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్‌లో ఉగ్రవాదుల నియామకాలు

21-10-2024 12:00:00 AM

  1. నిఘా పెరగడంతో సోషల్ మీడియాపై ఆధారపడుతున్న ఉగ్రసంస్థలు
  2. కశ్మీర్‌లో జోరుగా పాక్ ఐఎస్‌ఐ, ఉగ్రసంస్థల రిక్రూట్‌మెంట్లు
  3. ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా యువతను ఆకర్షిస్తున్న సంస్థలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఉగ్రవాద నియామకాలపై నిఘా పెరుగుతోన్న కొద్దీ పాకిస్థాన్ ఐఎస్‌ఐ, ఉగ్రసంస్థలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లో డిజిటల్ ప్లాట్ ఫాంల ద్వారా రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తున్నాయి.

సోషల్ మీడియా, మెస్సేజింగ్ యాప్ ల ద్వారా యువతను ఆకర్షిస్తున్నాయి. వారి గుర్తింపును తెలియకుండా ఉంచేందుకు నకిలీ ఖాతాలు, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్)ను ఉపయోగిస్తున్నారు. ఎవరైనా వారి ప్రక టనలకు ఆకర్షితులైతే ప్రైవేట్ గ్రూపుల్లో చేర్చి అక్కడ భద్రతా దళాలు అకృత్యాలు చేసినట్లుగా కల్పిత వీడియోలతో వారిని తమవైపుకు తిప్పుకుంటున్నారు.

పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమందిని నియమించినట్లు సమాచారం. యువతలో ద్వేషాన్ని రెచ్చగొట్టి, రిక్రూట్‌మెంట్‌కు అనుకూలంగా చెప్పే కథలకు సంబంధించిన స్క్రిప్ట్‌ను అందిస్తుందని తెలుస్తోంది. 

పాత సూత్రాలతో కొత్త రిక్రూట్‌మెంట్

ఉగ్ర నియామకాల్లో మరింత ఆందోళన కలిగించే విషయమేంటంటే ఈజిప్టుకు చెందిన ఉగ్రవాది సయ్యిద్ కుతుబ్ ప్రణాళికను ఉపయోగించి కొత్తగా ఈ రిక్రూట్‌మెంట్లు చేస్తున్నా రు. లౌకిక ప్రభుత్వాలు, పాశ్చాత్య భావనలకు వ్యతిరేకంగా జీహాద్‌ను ప్రకటించిన కుతుబ్‌ను 1966లో ఉరితీశారు.

ఆల్‌ఖైదా వంటి ఇస్లామి క్ తీవ్రవాద సంస్థలు తమ భావజాలాన్ని ఇత ని సాహిత్యం నుంచే గ్రహించారు. కానీ కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటి నియామకాలు ప్రత్యక్ష పరిచయం ద్వారా జరిగేవి. కానీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ పెరగడం వల్ల ఆన్‌లైన్ రిక్రూ ట్‌మెంట్‌పై ఆధారపడుతున్నారు.

తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు ఉగ్రసంస్థలకు ఇంటర్నెట్ అనుకూలంగా మారింది. దక్షిణ కశ్మీర్‌లో ఈ తరహా రిక్రూట్‌మెంట్ జరుగుతోందని అధికారులు గుర్తించారు. జమ్ముకశ్మీ ర్‌లో నిషేధిత టెలిగ్రామ్, మాస్టోడాన్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల సీక్రెట్ కమ్యూనికేషన్స్ జరుగుతున్నట్లు చెబుతున్నారు. 

గతంలో ఐరాస తీర్మానం

ఐక్యరాజ్యసమితి కూడా దీనిపై దృష్టి సారించింది. ఈ సవాళ్లకు ప్రతిస్పందనగా భద్రతా మండలి 2017లో 2,354 తీర్మానాన్ని ఆమోదించి సమగ్ర అంతర్జాతీయ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ చార్టర్‌తో ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు, సభ్య దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తించడం, సంబంధిత సంస్థల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను ఇందులో ప్రతిపాదించారు.

ఇదే విషయంపై ఐరాసలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. తీవ్రవాద సంస్థలు సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిం చారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుతూనే ఆయా టెక్నాలజీ సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అయినా మళ్లీ ఇప్పుడు డిజిటల్ వేదికల ద్వారా రిక్రూట్‌మెంట్ భారీ స్థాయిలో జరుగుతుండటం భారత్‌లో ఆందోళన పెంచుతోంద ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.