calender_icon.png 26 April, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్ర మూకలను శిక్షించాలి

25-04-2025 01:28:50 AM

ఉగ్రదాడిని నిరసిస్తూ న్యాయవాదుల విధుల బహిష్కరణ

వికారాబాద్, ఏప్రిల్-24 కశ్మీర్లోని పహల్గాంలో దాడిని నిరసిస్తూ వికారాబాద్ కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి  నిరసన తెలిపారు. ఉగ్రవా దులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రెండు నిమిషాలు మౌ నం పాటించి మృతుల కుటుంబాలకు ప్రగా ఢ సానుభూతిని తెలిపారు.  ఈ సందర్భంగా వికారాబాద్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నూలి బసవరాజ్ మాట్లాడుతూ..

పహల్గాం ఘట న తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామ న్నారు. దాడి ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనకు కారకులైన వారిని ఎవరిని వదిలి పెట్టొద్దని కేంద్రానికి లేఖ రాశారు.

ఆ లేఖను వికారాబాద్ ఆర్డీవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో.. బార్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి పోలీస్ వెంకట్ రెడ్డి , ఉపాధ్యక్షుడు శంకరయ్య , కోశాధికారి మోహన్ రాథోడ్, లైబ్రేరియన్ సాయి కుమార్ తో పాటు న్యా యవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.