04-03-2025 12:59:21 AM
ఫరీదాబాద్, మార్చి 3: అయోధ్య రామాలయంపై ఉగ్రకుట్ర చేసేందుకు కుట్ర జరిగిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అయోధ్య రామాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఆలయంపై గ్రనేడ్లతో దాడి చేసేందుకు ఓ వ్యక్తి సిద్ధం అయ్యాడు. అతడిని ఫరీదాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రెండు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వాడ్ (ఏటీఎస్), ఫరీదాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) చేసిన పోలీసులు.. గ్రనేడ్లను నిర్వీర్యం చేశారు. ఆ వ్యక్తి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు గుజరాత్‌కు తరలించారు. అంతే కాకుండా అతడి వద్ద నుంచి రాడికల్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.