calender_icon.png 13 April, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌లో ఉగ్రదాడులు జరగొచ్చు!

13-04-2025 01:36:44 AM

హెచ్చరికలు జారీ చేసిన నిఘా సంస్థలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారత్‌లో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సంస్థ లు హెచ్చరికలు జారీ చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. ఈ క్రమం లో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పా యి.

దీంతో తీర ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలని ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ)సూచించింది. ముంబై ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చి విచారిస్తోన్న తరుణంలో హెచ్చరికలు రావడం గమనార్హం. ప్రస్తుతం తహవూర్ రాణా ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా ముంబై కి చేరుకొని సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు కొనసాగిన మారణహోమంలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.