28-04-2025 10:05:29 PM
హుజురాబాద్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందె రాధిక-శ్రీనివాస్..
హుజురాబాద్ (విజయక్రాంతి): కాశ్మీర్లో హిందువులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని తాజా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక -శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పెహల్గాం ఉగ్ర దాడిలో మృతులకు పట్టణ ఆర్యవైశ్య, యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం నివాళులర్పించారు. పట్టణంలోని పలు వీదగుండా క్రోవత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ వద్ద మౌనం పాటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్ చేస్తూ వారిపై కాల్పులు జరపడం పిరికిపంద చర్య అని అన్నారు. దేశంలో ఎక్కడా కూడా హిందువులపై దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు హరిశంకర్, యువజన సంఘం అధ్యక్షులు నాగరాజు, గర్రెపల్లి శ్రీనివాస్, చక్రధర్, పాల కృష్ణమూర్తి, నార్ల శ్రీనివాస్, మడిశెట్టి ప్రసాద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.