calender_icon.png 26 April, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రదాడి పిరికిపంద చర్య..

25-04-2025 06:19:09 PM

బీజేపీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్..

హుజురాబాద్ (విజయక్రాంతి): జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడి పిరికిపంద చర్య అని బిజెపి సీనియర్ నాయకుడు కాశెట్టి కుమార్(Senior BJP leader Kasetti Kumar) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉగ్రదాడులను అరికట్టి దేశంలో శాంతి చేకూరేలా చూడాలని బీజేపీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్ అన్నారు. ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు కాశెట్టి కుమార్ సంతాపం తెలిపారు.

ప్రశాంతంగా ఉన్న దేశంలో అలజడులను సృష్టించేందుకు ఉగ్రవాదులు దాడులు చేశారని, ఇది అత్యంత బాధాకరమైందని, అభం శుభం తెలియని అమాయక ప్రజలు ఉగ్రదాడులకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన పాకిస్తాన్ మూల్యం చెల్లించకోక తప్పదని అన్నారు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం క్షమించరాని నేర మన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకొని ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.