29-04-2025 04:13:37 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పహల్గామ్ ఘటన జరిగిందని, అటువంటి చర్యలు మళ్లీ జరగకుండా దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల సిపిఎం కార్యదర్శి గొడిశాల వెంకన్న మాట్లాడుతూ పెహల్గామ్ ఘటనకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, మతోన్మాదాన్ని ఏమాత్రం ఉపేక్షించరాదని డిమాండ్ చేశారు. ఉగ్రదాడులకు బలైన పహల్గాం మృతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బొబ్బల యాకూబ్ రెడ్డి, చాగంటి కిషన్, సావిత్ర, వెంకన్న, నిరూటీ జలంధర్, ఎల్లయ్య, జల్లే జయరాజు పాల్గొన్నారు.