calender_icon.png 24 April, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదం నశించాలి, కాశ్మీర్ మరణ కాండను ఖండిస్తున్నాం...

24-04-2025 05:43:33 PM

ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కొత్తగూడెం JAC

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ పహల్గాం పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో మృతి చెందిన సంఘటన దేశం యావత్తు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని, మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం కొన్ని నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

దేశ ఐక్యత శాంతి పరిరక్షణ ముఖ్యమని ఉగ్ర మూకలను కఠినంగా శిక్షించాలని దేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఈ నెల 25న శుక్రవారం అన్ని మసీదులలో పహాల్గం ఉగ్రదాడుల్లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక ప్రార్థనలు జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నయీమ్ ఖురేషి, అబ్దుల్ రబ్, AWS అధ్యక్షులు అమీర్ ఖాద్రి, ఆబిద్ హుస్సేన్, షరీఫ్ భాయ్, సయ్యద్ అన్వర్ అలీ, బాబు జానీ ఖాన్, రామవరం మస్జిద్ అధ్యక్షులు, అంకుష్, ఉస్మాన్, షమీయుద్దీన్, ఎండి జమాల్, ఖాజా ఉస్మాన్, హమీద్, తదితరులు పాల్గొన్నారు.