29-04-2025 12:41:22 AM
సంగారెడ్డి, ఏప్రిల్ 28(విజయక్రాంతి) :దేశంలో తీవ్రవాదాన్ని కూకటివేళ్ళతో పెకిలిం చాలని, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో ఉగ్రమూకల దాడి పిరికిపందల చర్యని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యాటక శాఖా మంత్రి కొండా సురేఖ విమర్శించారు. సోమవారం హత్నూర మండలంలోని మం గాపూర్ గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘు నందన్ రావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తీవ్రవాదుల దాడికి నిరసనగా రెండు నిముషాలు మౌనం పాటించా రు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ దేశంలో తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వనికి తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఎంపీ రఘు నందన్ రావుకు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్ధకత ఏర్పడు తుందని అన్నారు. రైతులు, ప్రజల మేలు కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు కృత జ్ఞతలు తెలియజేశారు.
త్వరలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమి స్తుందని తెలిపారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యం గా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి దేశానికే రోల్ మోడల్ అని అ న్నారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ భూ భారతి చట్టం లో రైతులకు చట్టా లపై అవగాహన కల్పించి, భూ సమస్యలు లేకుండా చూడాలన్నారు.
దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని వాటిలో 3 కోట్ల వరకు భూ సంబంధిత కేసులే ఉన్నాయన్నారు. భూ రికార్డులు డిజిటల్ గా మా ర్చాలని, భూధార్ లాంటివి గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినా కూడా అప్పటి ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. టిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడు తూ భూ భారతి చట్టం ఎంతో అనుభవజ్ఞులతో తయారు చేశారని,ధరణిలో అనేక లో పాలు ఉన్నాయని, గతంలో పేద రైతులను న్యాయస్థానాల చుట్టూ తింపారని అని అన్నారు.
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ రైతులు, ప్రతి ఒక్కరికీ నూతన చట్టం భూభారతి, దానిలోని అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబా రక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి,అదనపు కలెక్టర్ మాధురి,ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి , తాసిల్దార్ పర్వీన్ షేక్, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఉత్తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి...
విద్యార్థులు సంప్రదాయ మార్గాలను మాత్రమే ఆశ్రయించకుండా, స్వీయ లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. హత్నూర మండల కేంద్రంలోని అంబేద్కర్ రెసిడెన్షియల్ కళాశాలలో కోటి రూపాయలతో నిర్మించిన భోజనశాలకు, రూ.60.50 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఆమె ప్రారంభించారు. ఇంటర్ పరీక్షలలో రాష్ట్రంలోనే ఉత్తమ ర్యాంకులు సా ధించిన 25 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శాలువాతో సత్కరించి మొమెంటులో అందజేశారు. అంతకుముందు నూత న తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు.