27-04-2025 12:00:00 AM
జాగో ఇండియా జాగో ఫౌండేషన్ చైర్మన్ జావీద్ షరీఫ్
ముషీరాబాద్, ఏప్రిల్ 26 (విజయ క్రాంతి) : దేశంలో ఉగ్రవాదాన్ని నిర్దాక్షిణ్యం గా అంతం చేయాలనీ జాగో ఇండియా జాగో ఫౌండేషన్ చైర్మన్ జావీద్ షరీఫ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. పబ్లిక్ గార్డెన్స్ లో శనివారం పహల్గామ్లో అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ జాగో ఇండియా జాగో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.
ఈ సందర్బంగా ఫౌండేషన్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పహల్గామ్ ఉగ్రదాడుల బాధితులకు 2 నిముషాలు మౌనం పాటిం చి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జావీద్ షరీఫ్ మాట్లాడుతూ ఉగ్రవాదం ప్రతి మానవునికి ముప్పు అని, దానికి మతం లేదని, అది శాంతి నాశనం చేస్తుందన్నారు.
యువత ఉగ్రవాదాన్ని తిరస్కరిం చాలని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిలోఫర్ కేఫ్ యజమాని బాబు రావు, ఫౌండేషన్ సభ్యులు ముఖ్తర్, మణిలాల్ షా, డా.అలంగిర్ రిజ్వి, మొహమ్మద్ అలీ, అష్రాఫ్, కోచ్ ఖాలిద్, సురేందర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.